Thursday, 5 November 2026

ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి

సదాశివనగర్‌: మండలంలోని పద్మాజివాడీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాములు కోరారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో వందమంది విద్యార్థులకు గాను 76 మంది మాత్రమే హాజరవుతున్నారని ఉపాధ్యాయులు ఆయనకు చెప్పారు. అధికశాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఆయన ఉపాధ్యాయులను సూచించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ హరిసింగ్‌, కార్యదర్శులు సౌజన్య, రమేష్‌రావు, సర్పంచి లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *