హైదరాబాద్,(జనంసాక్షి): 67 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను టీఆర్‌ఎస్ తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించింది. పార్టీ ఉపాధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.




