హైదరాబాద్,(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీ గైరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి దీక్ష ఇరు ప్రాంతాల మధ్య ద్వేశాన్ని రెచ్చగొట్టడమే అవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజలు కలిసి ఉండలేమని చెబుతుంటే విజయమ్మ ఎలా దీక్ష చేస్తారని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలు సరిగా చూడలేని డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.




