హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా ఎంసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో 22 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు, 15 వేల ర్యాంకులలోపు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ రోజు జరుగుతుంది. ఈ నెల 22 వరకు వెబ్ ఆప్షన్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.




