హైదరాబాద్,(జనంసాక్షి:) తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇందిరాపార్క్ వద్ద శాంతి దీక్ష ప్రారంభించింది. ఈ దీక్షలో చుక్కా రామయ్య, జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు, న్యూడెమోక్రసీ నేత సూర్యం తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




