హైదరాబాద్,(జనంసాక్షి): సీమాంధ్ర రచయిత పరకాల ప్రభాకర్ ఓ జోకర్ అని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ నేత రఘు విమర్శించారు. ఇవాళ ఆయన విద్యుత్ సౌద వద్ద జరిగిన విద్యుత్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్నారు. ఆయన తెలంగాణపై నూటొక్క తప్పులు అనే పుస్తకం రాశారని అన్నారు. తెలంగాణవాదులు తన సవాలును స్వీకరించడం లేదని పదేపదే అంటున్నారని పేర్కొన్నారు. ఎన్నోసార్లు టీవీల్లో ప్రకటనలిచ్చామని, వాల్‌పోస్టర్లు వేశామని రఘు తెలిపారు. ప్రభాకర్‌కు దమ్ముంటే తన సవాలును స్వీకరించి చర్చకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. మొన్నటికి మొన్న తెలంగాణలో విద్యుత్ విషయంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సవాలు చేసినా ఇప్పటికి సీఎం స్పందించలేదని సీఎం కిరణ్‌కు కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేదని విమర్శించారు.




