హైదరాబాద్,(జనంసాక్షి): మా రక్తమాంసాలను దారపోసి హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం అని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన మాడియాతో మాట్లాడారు. పది జిల్లాలు షరతులులేని తెలంగాణకు మాత్రమే తాము అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే జరిగిందని ఆయన విమర్శించారు.




