హైదరాబాద్,(జనంసాక్షి:) శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ, రాష్ట్ర దేవాదాయశాఖ చేపట్టిన మనగుడి కార్యక్రమాన్ని ఈవో ఎంజీ గోపాల్ తిరుపతిలో ప్రారంభించారు. శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ కళాశాలలోని ఆలయంలో రక్షాకంకణాలకు పూజ నిర్వహించి విద్యార్థులకు కంకణాలు పంపిణీ చేశారు.




