హైదరాబాద్,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని వాసవీనగర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుండిలో పడేసి వెళ్లారు. పందులూ, కుక్కలు గుమికూడటంతో అక్కడ శిశువు ఉన్న సంగతి గుర్తించిన స్థానికులు జంతువులను అదిలించి శిశువును రక్షించారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. శిశువుకు గాయాలు కావడంతో స్థానిక పిల్లల ఆసుపత్రికి తరలించారు.




