Wednesday, 4 November 2026

సీఎం, బొత్సలపై నిప్పులు చెరిగిన పొంగులేటి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన విషయంలో వారిద్దరి వైఖరిని ఆయన తప్పుబట్టారు. సీమాంధ్రలో సోనియాను అవమానపరుస్తుంటే ఖండించాల్సింది పోయి ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *