హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థులు చేపట్టిన శాంతి ర్యాలీపై పోలీసులు దౌర్జన్యం చూపించారు. హైదరాబాద్ హమారా అనే నినాదంతో శాంతి ర్యాలీ చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిజాం కళాశాల వద్ద టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌తో పాటు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాం కళాశాల నుంచి లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని విద్యార్థులు నిర్ణయించారు. కానీ నిజాం కళాశాల వద్దనే శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు మండిపడ్డారు. పోలీసులకు, సీమాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




