Monday, 2 November 2026

రూపాయి పతనంపై రాష్ట్రపతిని కలవనున్న బీజేపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అంశాలపై బీజేపీ బృందం శుక్రవారం రాష్ట్రపతిని కలవనున్నట్లు ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో ప్రస్తుత సమస్యలకు పరిష్కారం అంత సులువుగా దొరకదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు లేకుండా పోయాయన్నారు. ప్రపంచ దేశాలు మనల్ని నమ్మడం లేదని రతన్‌ టాటా చెప్పడం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *