హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర సచావాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల వైఖరి నిరసనగా సీబ్లాక్ వైపు తెలంగాణ ఉద్యోగులు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సీమాంధ్ర ఉద్యోగులకు తొత్తులుగా వ్యవహరిస్తూ తెలంగాణ ఉద్యోగులను అడ్డుకున్నారని ఉద్యోగులు ఆరోపించారు.




