హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేయడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల దీక్షపై ఎందుకు స్పందించడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రాంత నేతలు నిరసన తెలిపితే అడ్డుకున్న పోలీసులు ఇప్పుడు రక్షణ ఎలా కల్పిస్తారంటు? ఇది సీమాంధ్ర ప్రభుత్వమే ఈ ఉద్యమాన్ని నడుపుతున్నట్లు స్పష్టమైందని ఇది కేంద్రాన్ని దిక్కరించడమేనని టీ జేఏసీ కోఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మణ్ అన్నారు.




