హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగులు ,నాయకులు చేసే ఆందోళనల వెనుక సీఎం హస్తం ఉందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఇరుప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన ముఖ్యమంత్రి కేవలం సీమాంద్ర ప్రాంతానికే ముఖ్యమంత్రిలా వ్యవహరించి కృత్రిమ సీమాంధ్ర ఉద్యమం సృష్టించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నాడని ఆయన అన్నారు. అసెంబ్లి సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్న ముఖ్యమంత్రి తెలంగాణపై తన వంకర బుద్దిని బయటపెట్టాడని ,రేపు జరిగే ఏపిఎన్జీవోల సభకు సీమాంధ్ర ముఖ్యమంత్రి ,డీజీపి ఏకపక్షంగా అనుమతి ఇచ్చారని ,తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగినపుడు ఉద్యమానికి అనుమతి ఇవ్వకుండా ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచాలని చూసిన ముఖ్యమంత్రి ఇపుడు సీమాంధ్ర సభకు ఏవిధంగా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జరిగే 24గంటల బంద్‌కు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించి స్వచ్చందంగా బంద్‌లో పాల్గొనాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీమాంధ్ర ఆందోళనల వెనుక సీఎం హస్తం : హరీష్‌రావు





