హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగననున్న ఏపిఎన్జీవోల సభ నేపథ్యంలో నగరంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ ఆంక్షలు అమలులులో ఉంటాయని నగర ట్రాఫిక్ అడిషనల్ కమీషనర్ తెలిపారు. ఎఆర్ పెట్రోల్‌పంప్ నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు.వాటిని గన్‌పౌండ్రి ఎన్‌బీహెచ్ వైపు మళ్లిస్తారు.ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ,బషిర్‌బాగ్ నుంచి వచ్చే వాటిని హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు ,రాజ్‌మొహల్ల వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా సెమెట్రి జంక్షన్‌వైపు ,కింగ్‌కోఠి,బషిర్‌బాగ్ ,భారతీయ విద్యాభవన్ నుంచి వచ్చే వాటిని కింగ్‌కోఠి మీదుగా తాజ్‌మహాల్ హోటల్ వైపు,లిబర్టీ మీదుగా బషిర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌సాగర్ వైపు మళ్లిస్తారు




