హైదరాబాద్ : సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగసభ ప్రత్యక్షప్రసారం చేసే సీమాంధ్ర ఛానళ్లను ఈ రోజు నిలిపివేసేందుకు తెలంగాణ ఎంఎస్‌వోలు నిర్ణయం తీసుకున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న ఆ చానెళ్ల ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించాయి. స్వయంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేస్తామని ఆయా సంఘాల నేతలు ప్రకటించారు.




