Wednesday, 4 November 2026

నిజాం కళాశాల హాస్టల్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ :నిజాం కళాశాల వసతి గృహం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాస్టల్‌లో ఉన్న నాన్‌ బొర్డర్స్‌ను పోలీసులు బయటకు పంపుతున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. కొందరూ విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. విద్యార్థి విభాగం అద్యక్షుడు సుమన్‌తో పాటు పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *