హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో మీటింగ్‌కు వచ్చిన ఏపీఎన్జీవోలు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయడంతో విద్యార్ధులు ప్రతిఘటించడంతోనే నిజాం హాస్టల్‌లో హింస జరిగిందని హాస్టల్ విద్యార్థులు తెలిపారు. రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేస్తూ హాస్టల్ అద్దాలు పగలగొట్టిన వారిని అక్కడి నుంచి వెళ్ల గొట్టకుండా విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని విద్యార్ధులు ప్రశ్నించారు. ప్రస్తుతం హాస్టల్ వద్ద పోలీసులు వీరంగం చేస్తున్నారు




