Wednesday, 4 November 2026

ఇప్పటికే విజయవంతం చేశాం

సంయమనం పాటించండి
ప్రజలకు టీజేపీ చైర్మన్‌ కోదండరాం
హైదరాబాద్‌, సెప్టెంబరు7 (ఎపిఇఎంఎస్‌): సమైక్యవాదుల సభ వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వెనక్కుపోతుందని  ఆందోళన వద్దని, తెలంగాణ బంద్‌ విజయవంతం అయిందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం చెప్పారు. శనివారం ఆయన టీఎన్జీవో భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బంద్‌ సంపూర్ణమైందని, ఏపీఎన్జీవోలు సభ పెట్టుకోవడం వారి హక్కేనని, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అడ్డుకునే ప్రయత్నం క్షమార్హం కాదన్నారు. పది జిల్లాల తెలంగాణ ప్రజలు బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేశారన్నారు. అనవసరం భయాందోళనలు వద్దని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రౌడీలు, గూండాలు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారని, వారు అల్లర్లు సృష్టించడం ద్వారా హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ లేదనే సంకేతాలను బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరించి తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసుకుందామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *