Wednesday, 4 November 2026

ఖైరతాబాద్‌ గణేష్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : గణేష్‌ ఉత్సవాల సందర్బంగా నగరంలోని మండపాల వద్ద బాణసంచా కాల్చడం నిషేదమని పోలీసులు వెల్లడించారు.ఖైరతాబాద్‌ వినాయకుడి విగ్రహాన్ని సందర్శించేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నందున..పది రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు నగర పోలీస్‌ కమీషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు.ఈనెల 9నుంచి 19 వరకు ఇవి అమల్లో ఉంటాయని ఆయన తెలపారు.
ౖ-నెక్లెస్‌రోడ్‌ ,మింట్‌ కాంపౌండ్‌ నుంచి ఖైరతాబాద్‌ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలను ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ప్రసాద్‌ ఐమాక్‌న వైపు మళ్లిస్తారు,
-పంజాగుట్ట ,ఖైరతాబాద్‌ లనుంచి గణేష్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను రైల్వేగేటు గుండా అనుమతించరు.నిరంకారి భవన్‌ మీదుగా వెళ్లాలి.
-రాజ్‌దూత్‌ హోటల్‌ ,ఖైరతాబాద్‌ కూరగాయల మార్కెట్‌ ,సీబీఐ క్వార్టర్స్‌ నుంచి ఖైరతాబాద్‌ లైబ్రరీవైపు వెళ్లే వాహనాలను మున్సిపల్‌ వార్డు కార్యాలయం వద్ద మళ్లిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *