ఉగ్రవాది అక్తర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చిన ఎన్‌ఐఏ
హైదరాబాద్ : ఇండో- నేపాల్ సరిహద్దులో పట్టుబడిన ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను ఎన్‌ఐఏ అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు ముందు బహదూర్‌పురాలో ఉగ్రవాదులు నివాసమున్న ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బాంబుల తయారీకి సంబందించిన కొన్ని పదార్థాలను ఎన్‌ఐఏ బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.



