Wednesday, 4 November 2026

సీఎం,డీజీపీపై ఎంపీ వివేక్‌ ఆగ్రహం

ఆదిలాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , డీజీపీ దినేష్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ వివేక్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి సీఎం, డీజీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ దినేష్‌రెడ్డి పదవీ కాలం కొనసాగింపు కోసం సీఎం కిరణ్‌ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టిన పోలీసులు సీమాంధ్రలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియాపై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *