మణికొండలో సం’గ్రామం’

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): మణికొండలో గ్రామ పోరు రసవత్తరంగా సాగుతోంది.. మణికొండలో ఈ నెల 21న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.. అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగి స్తున్నారు. కాలనీలలోని వారిని, కుల సంఘాల పెద్దలను కలుసుకుంటూ.. పాదయాత్రలు చేస్తూ గడపగడపకు చేరుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక సర్పంచ్‌ పదవికి గాను ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు..  వారికి గుర్తులను సైతం కేటాయించారు. కొండకల్ల నరేందర్‌ రెడ్డి (గంప గుర్తు),బుద్దోలు జైహింద్‌రావు (ఉంగరం గుర్తు), యాలాల నరేశ్‌ (కత్తెర)గుర్తులతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే మణికొండలో మొత్తం 14 వార్డులు.. 14వార్డులకు గాను 63మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం తహసీల్దార్‌ ముకుందరెడ్డి, ఎమ్డీవో సుజాత తదితరులు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.

తాజావార్తలు