జవాబుదారీగా ఉండాలనే ఆస్తుల వెల్లడి : చంద్రబాబు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 :దేశం సంక్షోభంలో ఉందని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబు అన్నారు. సోమవారంనాడు మీడియా ఎదుట తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ అవినీతి వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని, రూపాయి విలువ క్షీణించిందని అన్నారు. అవినీతి పెచ్చుమీరడం వల్లే ఆర్థిక సమస్యలు తలెత్తాయన్నారు. హవాలా మార్గంలో వచ్చే ధర ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమని అన్నారు. మైనింగ్‌, సెజ్‌ల పేరిట సంపాదించాలను కోవడం కొందరు నేతలకు తగదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు తన ఆస్తుల విలువ రూ.42.06 లక్షలు అని పేర్కొన్నారు. తన సతీమణి భువనేశ్వరిదేవి ఆస్తుల విలువ రూ.3305.02 లక్షలు, తన కుమారుడు లోకేష్‌ ఆస్తుల విలువ రూ.492.53 లక్షలు, తన కోడలు బ్రాహ్మణి ఆస్తుల విలువ 330.69లక్షలు అనితెలిపారు. 1992లో స్థాపించిన హెరిటేజ్‌ కంపెనీని పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాజకీయ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న ఉద్దేశంతో తన, తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించానని చంద్రబాబు వివరించారు.

తాజావార్తలు