భారీ వర్షం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16: నగరంలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాలుగున్నర గంటల వరకు కురుస్తూనే ఉంది. వనస్థలిపురం, దిల్‌సుక్‌నగర్‌, మలక్‌పేట, ఆబిడ్స్‌, నాంపల్లి, మాసబ్‌టాంక్‌, ఎసి గార్డ్స్‌, మెహదీపట్నం, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు వదిలిపెట్టే సమయం కావడంతో విద్యార్థులు, తల్లి దండ్రులు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు సైతం అవస్థలుపడ్డారు.

తాజావార్తలు