హైదరాబాద్: భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జనిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పురస్కరించుకుని వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఎం తెలిపింది. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 05.45 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ , సీపీఐ(ఎంఎల్’ నేత గుర్రం విజయ్‌కుమార్, ఎంసీపీఐ (యు) నాయకుడు ఎండీ గౌస్, సీసీఐ(ఎం-ఎల్) లిబరేషన్ నేత ఎన్.మూర్తి తదితరులు పాల్గొనున్నారు.




