తెలంగాణ ఉద్యోగులకు దసరా బోనస్ ఇవ్వలేం : ఆర్టీసీ యాజమాన్యం
హైదరాబాద్ : సీమాంధ్రలో సమ్మె కారణంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్ ఇవ్వలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ ఇవ్వాలని ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ నెల 27న తెలంగాణ వ్యాప్తంగా డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేయాలని ఈయూ కార్యదర్శి పద్మాకర్ ఆర్టిసీ కార్మికులకు పిలుపునిచ్చారు.



