శ్రీమతి సిల్స్‌మార్స్ హైదరాబాద్ పోటీల్లో మెరిసిన మగువలు
హైదరాబాద్ : పట్టుచీరలు ధరించి సంప్రదాయ సోయగంతో మహిళలు భారతీయత వస్త్రధారణ ప్రత్యేకతను చాటారు.శ్రీమతి సిల్స్ మార్క్ హైదరాబాద్ -2013 పోటీలకు వివిధ రంగాలకు చెందిన మహిళలు రంగురంగుల పట్టుచీరలు కట్టుకుని హాజరయ్యారు. సిల్స్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.భారతీయ సంప్రదాయ చీరకట్టును నేటి తరం మగువలకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు.



