డల్లాస్‌లో బతుకమ్మ -దసరా ఉత్సవాలు

వాషింగ్టన్‌ : డల్లాస్‌ ఏరియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో త్వరలో ప్లానో నగరంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యనిర్వాహక బృందం తెలిపింది.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్‌ , గోరెటివెంకన్న , హాజరవుతున్నట్లు వారు తెలిపారు.బతుకమ్మ పండుగ ,దసరా జమ్మి పూజ, వేషాదారణలు,నిమజ్జనం వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు.