నేడే పాలమూరులో బీజేపీ తెలంగాణ గర్జన : హాజరుకానున్న సుష్మాస్వరాజ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీ వైఖరీలో ఎటువంటి మార్పు లేదని పునరుద్ఘాటించేందుకు ,ఏపార్టీతోను పొత్తులుండవని చెప్పేందుకు శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లో బీజేపీ ప్రజా గర్జన సభ నిర్వహిస్తుంది.ఈ సభకు సుష్మాస్వరాజ్‌ హాజరుకానున్నారు.సుమారు 50వేల మందిని అందులో ఎక్కువగా మహిళల్ని సభకు తరలించేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.