సీఎం వ్యాఖ్యలు సమంజసం కాదు : మంత్రి డి.కే అరుణ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి స్పందిస్తూ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డి.కే అరుణ స్పందించారు. శనివారం హైదరాబాద్‌లో ఆమె విలేర్లతో మాట్లాడుతూ విభజనపై సీఎం స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని అభిప్రాయపడ్డారు.
కాలానుగుణంగా రాజ్యాంగాన్ని ,చట్టాలను మార్చుకుంటున్నామని , తెలంగాణపై నిర్ణయం కూడా మార్చుకుంటున్నామని తెలంగాణపై నిర్ణయం కూడా అలాంటిదే అని అరుణ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇరుప్రాంతాల ప్రజలకు ఇష్టం లేని రోజు విడిపోవచ్చని గతంలో భారత మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహార్‌లాల్‌ నెహ్రూ చెప్పిన మాటలను అరుణ ఈ సంధర్బంగా గుర్తు చేశారు. ఆ మాటలు మరిచారా అని సీఎం కిరణ్‌ను ప్రశ్నించారు.

తాజావార్తలు