నేడే తెలంగాణ సకల జనుల జనభేరి సదస్సు
హైదరాబాద్ : నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల రణనినాదాన్ని మోగించేందుకు హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానం సిద్దమైంది. ఆదివారం జేఏసీ సారధ్యంలో సకల జనభేరి సదస్సును నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కాళోజీ ప్రాంగణంలో జయశంకర్ వేదిక నుండి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్‌ను ఎలుగెత్తి చాటుతున్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన నాటినుండి రెండు మాసాలు గడుస్తున్న నేటి వరక తెలంగాణ పక్రియ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనందుకు నిరసనగా ,ఢిల్లీకి కనిపించేలా తెలంగాణ నినాదాలు ప్రతిధ్వనించేలా చేసేందుకు తెలంగాణ ప్రజలు కదిలివస్తున్నారు.



