జైతెలంగాణ నినాదాలతో మార్మోగుతున్న నిజాం కాలేజ్ గ్రౌండ్
హైదరాబాద్ : తెలంగాణలోని దారులన్ని నగరం వైపు దారితీస్తున్నాయి. తెలంగాణ ఆకాంక్షను చాటేందుకు సబ్బండ వర్ణాల ప్రజలు సకల జనుల భేరికి తండోపతండాలుగా తరలివచ్చారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు పది జిల్లాల నుండి లక్షలాది మంది జనంతో నిజాం కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది.




