మహిళలపై ఆగని అఘాయిత్యాలు గుంటూరులో ఇంటర్‌విధ్యార్థినిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ :మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలు,అఘాయిత్యాలు,దాడులు ఆగడానికి దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన అవి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల మహిళలపై దాడులు ఆగకపోగా మరింత పెరుగుతున్నాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక ప్ర్రాంతంలో దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ ఇంటర్ విధ్యార్థినిపై ఓ గుర్తుతెలియని యువకులు అత్యాచారాయత్నానికి యత్నించారు. అడ్డోచ్చిన భాదితురాలి తండ్రిపై దాడికి పాల్పడ్డారు. అత్యాచార యత్నానికి గురైన విధ్యార్ధిని మనస్తాపంతో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.



