ద్రోహం చేసిన వాళ్లను ద్రోహులే అంటాం : కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే వాళ్లను తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లను ద్రోహులే అంటాం అని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తు వ్యతిరేకించేవాళ్లను తెలంగాణను అడ్డుకుంటున్న వాళ్లను ద్రోహులు అనకపోతే మరేమంటారని ఆయన ప్రశ్నించారు.బరాబర్ అంటాం ఏం చేస్తారు.అని ఆయన అన్నారు.కేసీఆర్ మాట్లాడగానే ఏదో మాట్లాడడం సీపీఐ నారాయణకు బీజేపీ దత్తాత్రయకు ప్యాషన్ అయిపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను కించపరుస్తున్న సీమాంధ్ర నేతలు అక్కడి ప్రజలు మాట్లాడినప్పుడు నారాయణ ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు.



