తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
హైదరాబాద్ : తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తుల వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 5గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 58,573 మంది భక్తులు దర్శించుకున్నారు.



