హైదరాబాద్ : సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా దిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన గంటకే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. విమానంలో 102 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.




