మాదాపూర్‌ హైటెక్‌లో వ్యభిచారం గుట్టురట్టు : బుల్లితెర నటి అరెస్టు

 

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధానిలో ఐటీ కంపెనీల కేంద్రానికి నిలయమైన మాదాపూర్‌లో హైటెక్‌ వ్యభిచారం గుట్టురట్టైంది. మాదాపూర్‌లోని సైబర్‌ టవర్‌ ప్రాంతంలో సాగుతున్న హైటెక్‌ వ్యభిచారాన్ని ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యభిచారంలో పాల్గొన్న బుల్లితెర నటి శ్రావణితో పాటు ఓ పారిశ్రామిక వేత్త పోలీసులకు దొరికిపోయారు. ఈ వ్యభిచారంలో దొరికిన శ్రావణి తెలుగు బుల్లితెరపై ‘లయ’ , హిమబిందు సీరియల్‌లో నటించింది. ఈమే పారిశ్రామిక వేత్తతో ఒక రోజు గడిపేందుకు లక్ష రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.

తాజావార్తలు