సింగరేణి కార్మికలకు దీపావళి బోనస్
హైదరాబాద్ :సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ బోనస్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇవాళ కోల్‌కతాలోని జేబీసీసీఐ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. కార్మికులకు రూ .31,500 లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. గత సంవత్సరం ఈ మొత్తం రూ.26,500లు చెల్లించగా ఈ సారి రూ.5వేలు పెంచారు.దీనితో కలిపి రూ.31,500 రూపాయలు కార్మికులకు చెల్లించనున్నారు.



