హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. కేబినేట్ నోట్‌లోని కీలక అంశాలు.
– పది జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు
-పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
-సత్వరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై నిర్ణయం
-నిర్దేశిత గడువులోగా రాజధాని మార్పిడి ప్రక్రియ
-ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు
-నీటి పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకుంటే అంతిమ నిర్ణయం కేంద్రానిదే.
-రాష్ట్ర విభజన
రాజ్యసభ స్థానాలు : తెలంగాణలో 8,ఆంధ్రప్రదేశ్‌లో 10
లోక్‌సభ స్థానాలు : తెలంగాణలో 17 ,ఆంధ్రప్రదేశ్‌లో 25
శాసన మండలి స్థానాలు స్థానాలు కొనసాగించే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే.
అసెంబ్లీ స్థానాల విభజన : తెలంగాణలో 119 ,ఆంధ్రప్రదేశ్‌లో 175 ,
తెలంగాణ అసెంబ్లీకి ఒక నామినేటేడ్ సభ్యుడు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రస్తుత స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్ ,తెలంగాణకు కొత్త స్పీకర్,డిప్యూటి స్పీకర్ ,లోక్‌సభ రిజర్వేషన్ల సంఖ్య :ఎస్సీ -3, ఎస్టీ -2,
అసెంబ్లీ రిజర్వేషన్ల సంఖ్య : ఎస్సీ -19, ఎస్టీ -12, రెండు ప్రాంతాలకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేస్తారు.ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారానే జరుగనున్నాయి.




