మీడియాపై ఎన్‌ఐఏ కోర్టు ఆంక్షలు

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు విచారణ వార్తల ప్రసారం విషయంలో ఎన్‌ఐఏ కోర్టు మీడియాపై ఆంక్షలు విధించింది.కేసు విచారణ పూర్తయ్యే వరకు మీడియాపై ఆంక్షలు ఉంటాయని కోర్టు తెలిపింది. జంట పేలుళ్లకు సంబంధించిన సమాచారం ప్రచురణ, ప్రసారం చేయొద్దని కోర్టు ఆదేశించింది.