విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలి : ముఖ్యమంత్రి కిరణ్
హైదరాబాద్ : విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఏ తప్పూ చేయని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ,విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా పలుచోట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి విద్యుత్ ఉద్యోగులను సమ్మె విరమించాల్సిందిగా కోరారు.



