Tuesday, 3 November 2026

7న తెదేపా ఉత్తర తెలంగాణ ప్రాతీయ సదస్సు

వరంగల్‌: తెలంగాణకు ఇదే సరైన సమయమని… పది రోజుల్లో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తే…. ఈ ప్రాంతంలో ఆపర్టీకి పుట్టగతులుండవని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. వరంగల్‌లో ఈనెల 7న తెలుగుదేశం పార్టీ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. సదస్సు జరిగే మైదానాన్ని తెదేపా నేతలు పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *