గన్నవరం,(జనంసాక్షి): కేంద్రమంర్రతి కావూరి సాంబశివరావు స్వాగత యాత్రలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలి ఒకరు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరి తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.
అక్కడ నుంచి ర్యాలీగా కొనసాగుతుండగా కృష్ణాజిల్లా పెద అవుటపల్లి వద్ద కొన్ని నిప్పురవ్వలు బాణాసంచా ఉంచిన వాహనంపై పడ్డాయి. దాంతో వాహన డ్రైవఱ్ సజీవ దహనం కాగా మరో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.




