హైదరాబాద్: చలో అసెంబ్లీ నేపథ్యంలో 700 మంది తెలంగాణ వాదులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడిరచారు. అరెస్టయిన వారిలో 45 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలిపారు. చిన్న చిన్న ఘటనలు మినహా చలో అసెంబ్లీ కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని వివరించారు. ఓయూలో బాష్పవాయువు ప్రయోగంలో గ్యాస్ షెల్ తగిలి ఓ విద్యార్ధి గాయపడ్డాడని తెలిపారు.




