హైదరాబాద్ : పర్యావరణానికి మేలు చేసే సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళీకృష్ణ ఆదివారం విజయవాడలో విడుదల చేశారు. కిలోమీటర్‌కు మూడు పైసలు మాత్రమే ఖర్చవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సియోల్,దక్షిణ కొరియా దేశాల సాంకేతిక నిపుణుల సహకారంతో వెరిడియన్ అనే సంస్థ ఈ సైకిల్‌ను రూపొందించినట్లు వివరించారు. సైకిల్‌కు అమర్చిన లిధియం బ్యాటరీ గంట ఛార్జీంగ్‌తో 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్ధ ప్రతినిధి మహిధర్ తెలిపారు. బ్యాటరీ వద్దు అనుకున్నప్పుడు సాధారణ సైకిల్ మాదిరిగానే నడపవచ్చని రిజిస్ట్రేషన్ ,లైసెన్స్ అవసరం లేదని ఆయన వెల్లడించారు.




