హైదరాబాద్ : పెరిగిపోతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని కుషాయిగూడలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చర్లపల్లిలో పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించి ,అవుట్ పోస్ట్ భవనానికి శంకుస్థాపన చేశారు. కుషాయిగూడలో పోలీస్‌స్టేషన్ నిర్మించిన సిబ్బంది విశ్రాంత గదిని కూడా ఆయన ప్రారంభించారు.




