Tuesday, 3 November 2026

నెత్తురోడిన రహదారులు :వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

్‌
హైదరాబాద్‌ : రహదారులు రక్తసిక్తమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పలువురు క్షతగాత్రులయ్యారు. శ్రీశైలం- హైదకాబాద్‌ ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ,మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సిలిండర్ల లోడుతో అమ్రాబాద్‌ నుుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఆటో చెట్టును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పలపల్లికి చెందిన చందూలాల్‌ ,చందంపేట మండలం తండ్రలగడ్డ గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందాడు. అచ్చంపేట మండలం గణపూర్‌ గ్రామానికి చెందిన లక్‌పతి తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *