హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ నేడుకల సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం ,ఇందిరాపార్కు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఈ ఆంక్షలు నవంబర్ 1న ఉదయం ఆరుగంటల నుంచి అమల్లో ఉంటాయి.




